- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్లో రచ్చ చేసిన హీరో భార్య.. వీడియో వైరల్
దిశ, సినిమా: దాదాపు మూడేళ్ల నుంచి ఊరిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. Latest Telugu News..

దిశ, సినిమా: దాదాపు మూడేళ్ల నుంచి ఊరిస్తున్న 'ఆర్ఆర్ఆర్' ఎట్టకేలకు విడుదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుతుండగా.. అభిమానులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఉదయమే థియేటర్ల ముందు వాలిపోయారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ భార్య ఉపాసన సైతం మార్నింగ్ షోకు వెళ్లగా థియేటర్‌లోనే సాధారణ ప్రేక్షకురాలిగా ఎంజాయ్ చేసింది. పేపర్లు చింపి గాల్లోకి ఎగరేస్తూ రచ్చ చేసిన ఆమె.. 'నాటు నాటు' సాంగ్‌కు కేకలు పెడుతూ ఫ్యాన్స్‌తోపాటు నిలబడి డ్యాన్స్ మూమెంట్ చేయడం విశేషం.
కాగా ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీలో ఎన్‌టీఆర్ కొమురం భీం, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లలో అదరగొట్టగా.. అలియా భట్ నుంచి ఒలివియా మోరిస్ వరకు ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారని టాక్ నడుస్తోంది. సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా గూస్ బంప్స్ అంటున్న పలువురు సెలబ్రిటీలు 'ఆర్ఆర్ఆర్' మాస్టర్ పీస్, భారతీయ సినిమాను రాజమౌళీ మరోసారి అందలమెక్కించాడంటూ పొగిడేస్తున్నారు.
Mega power star @AlwaysRamCharan's wife @upasanakonidela at #RRRMovie Premiere show with fans 💥#RamCharan #RRRTakeOver pic.twitter.com/wfIeKclz0I
— KB Connects™ (@kb_connects) March 25, 2022






