- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహనీయుల విగ్రహాల ముసుగుల తొలగింపు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రాం విగ్రహాలపై ఉన్న ముసుగులను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో పలువురు దళిత నాయకులు గురువారం తొలగించారు.

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రాం విగ్రహాలపై ఉన్న ముసుగులను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో పలువురు దళిత నాయకులు గురువారం తొలగించారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. తమ హయాంలో దళిత సంఘాల విజ్ఞప్తి మేరకు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే విగ్రహాలు ఏర్పాటు చేసిన స్థలం ఆర్టీసీకి చెందినదని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అప్పట్లో ఆవిష్కరణ కార్యక్రమం నిలిచిపోయిందని అన్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రం సమర్పించగా వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే విగ్రహాలను ఘనంగా ఆవిష్కరిస్తామని చెబుతూ ఆలస్యం చేస్తుండటంతో, ఇక ఆలస్యం చేయకుండా మహనీయుల విగ్రహాలపై ఉన్న ముసుగులను తొలగించినట్లు రసమయి బాలకిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






