- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
మహారాష్ట్ర రాజ్యసభ బరిలో వినోద్ తావ్డే, రాందాస్ అథవాలే. దేశవ్యాప్తంగా మరో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ అధిష్టానం.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న రాందాస్ అథవాలే ను రాజ్యసభ బీజేపీ (BJP) నామినేట్ చేసింది. అలాగే మహారాష్ట్ర నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే (Vinod Tawde)లతో పాటు మాయా చింతామన్ ఇవ్వనే, రామారావు వడ్కుటే పేర్లను పార్టీ ప్రకటించింది. ముఖ్యంగా వినోద్ తావ్డేకు రాజ్యసభ అవకాశం కల్పించడం ద్వారా ఆయన సేవలను జాతీయ స్థాయిలో మరింతగా వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. పార్టీకి విధేయులుగా ఉంటూ సామాజిక సమీకరణాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేతలకు ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది. ఏప్రిల్‌లో ఖాళీ కానున్న ఈ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి.
9 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా
మరోవైపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ 6 రాష్ట్రాల నుంచి 9 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (బీహార్) పేరు ప్రముఖంగా ఉంది. బీహార్ నుంచి శివేష్ కుమార్, అస్సాం నుండి జోగెన్ మోహన్, తేరాష్ గోవాలా, ఛత్తీస్‌గఢ్ నుండి లక్ష్మీ వర్మ, హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సమ్వాల్, సుజిత్ కుమార్‌లను నామినేట్ చేశారు. పశ్చిమ బెంగాల్ నుండి రాహుల్ సిన్హాను బరిలోకి దింపారు. అనుభవజ్ఞులకు పార్టీ కోసం కష్టపడే నేతలకు పెద్దపీట వేస్తూ బీజేపీ ఈ ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది.






