RRR చిత్రాన్ని ఆకాశానికెత్తేసిన కేంద్ర మంత్రి

by Disha Web Desk 2 |
RRR చిత్రాన్ని ఆకాశానికెత్తేసిన కేంద్ర మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అద్భుతంగా ప్రదర్శింపబడుతోంది. కేవలం విడుదలైన పదిరోజుల్లోనే ఏకంగా 710 కోట్లు కొల్లగొట్టి, ప్రస్తుతం 900 కోట్లకు చేరుకున్నదని సమాచారం. అయితే, తాజాగా.. ఈ చిత్రాన్ని వీక్షించిన కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్రం అద్భుతంగా ఉందంటూ ఆకాశానికెత్తేయడం హాట్ టాపిక్‌గా మారింది. ''ఆర్ఆర్ఆర్' దేశంలోనే అతి పెద్ద సినిమా. ఇప్పటి వరకూ రూ.750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా భారీ వసూళ్ళు దక్కించుకుంటుంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలాగానే.. భారత ఆర్థిక వ్యవస్థ కూడా మోడీ నాయకత్వంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది' అంటూ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర మంత్రికి 'ఆర్ఆర్ఆర్' టీమ్ ధన్యవాదాలు తెలిపింది. దేశ అభివృద్ధిలో భాగమైనందుకు సంతోషిస్తున్నామని వెల్లడించారు.



Next Story

Most Viewed