బీజేపీలో ఆప్ విలీనానికి రాజ్యసభ ఆమోదం.. హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

by Malleboina Mahesh |

రాజకీయాల్లో పెను సంచలనం! బీజేపీలో విలీనమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఏడుగురు రాజ్యసభ ఎంపీలు. చైర్మన్ ఆమోదంతో అధికారికంగా మారిన సమీకరణాలు.

బీజేపీలో ఆప్ విలీనానికి రాజ్యసభ ఆమోదం.. హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు అధికారికంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీలో చేరారు. ఈ పరిణామంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు."గౌరవనీయులైన రాజ్యసభ చైర్మన్ ఏడుగురు రాజ్యసభ ఎంపీల విలీనాన్ని ఆమోదించారు. ఈ ఏడుగురు సభ్యులు బీజేపీ పార్లమెంటరీ పార్టీలో అంతర్భాగమయ్యారు. సుదీర్ఘకాలంగా వీరి పనితీరును గమనిస్తున్నాను.

వీరు ఎప్పుడూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదు. పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు. క్రమశిక్షణ కలిగిన ఇటువంటి నేతలకు బీజేపీలోకి సాదర స్వాగతం పలుకుతున్నాను" అని రిజిజు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణంలో (Nation Building) భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానిస్తూ, ఇదే క్రమంలో విపక్షాల 'ఇండి' (INDI) కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. "తుక్డే-తుక్డే ఇండి అలయన్స్‌కు గుడ్ బై చెప్పే సమయం వచ్చింది" అంటూ ఆయన తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story