- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై అమిత్ షా నిప్పులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పశ్చిమ బెంగాల్ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తన పశ్చిమ బెంగాల్ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియకు బెంగాల్ అధికారులు సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడంలో బీజేపీ పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి సహకరిస్తుందని, అనర్హులైన ఓటర్లను తొలగించి జాబితాను శుద్ధి చేస్తామని ఓ సమావేశంలో అమిత్ షా స్పష్టం చేశారు.
అలాగే బెంగాల్‌లోని టీ తోటల కార్మికుల దుస్థితిపై స్పందిస్తూ, టీఎంసీ ప్రభుత్వం (TMC Govt) వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని విమర్శించారు. అస్సాం తరహాలోనే బెంగాల్‌లోని టీ తోటల కార్మికులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఈ సందర్భంగా షా హామీ ఇచ్చారు. బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ టీ తోటల కార్మికులను కేవలం అగ్గిపెట్టె లాంటి చిన్న ఇళ్లను మాత్రమే ఇవ్వాలని చూస్తున్నారని, కానీ బీజేపీ వారికి భూమిపై హక్కులను ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు.
దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడదీసేందుకు "చికెన్ నెక్ కారిడార్" (సిలిగురి కారిడార్)ను కత్తిరిస్తామంటూ గతంలో ఢిల్లీలో నినాదాలు చేసిన వారిపై మండిపడ్డారు. "ఇదేమైనా మీ నాన్నగారి జాగీరా? ఇది భారతదేశ భూమి, దీనిని ఎవరు తాకలేరు" అంటూ అమిత్ షా ఘాటుగా వ్యాఖ్యానించారు. అటువంటి దేశద్రోహులను ఢిల్లీ పోలీసులు జైల్లో పెడితే, ఇండియా కూటమి నేతలు వారిని విడిపించేందుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లారని ఆరోపించారు. అయితే నిజం గెలిచిందని, సుప్రీంకోర్టు వారి బెయిల్ దరఖాస్తును తిరస్కరించిందని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తుచేశారు.






