- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి
రైల్వే ట్రాక్ పై పాత రాజంపేట గ్రామ శివారులో వెల్మ కన్వెన్షన్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మహిళ రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.

దిశ,కామారెడ్డి రూరల్: రైల్వే ట్రాక్ పై పాత రాజంపేట గ్రామ శివారులో వెల్మ కన్వెన్షన్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మహిళ రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ సాధు లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని మహిళ రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తలకు బలమైన గాయం తగిలి రక్తస్రావం జరిగిందని, ఆమెకు రెండు కాళ్లు విరిగినట్లు తెలిపారు. మహిళ 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందన్నారు. ఢీకొన్న వెంటనే అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. ఈ మహిళను గుర్తుపట్టడానికి ఎలాంటి ఐడి ప్రూఫ్ లభించలేవని పేర్కొన్నారు.
ఆమె ఎత్తు 5.1 గుండ్రని ముఖం చామన ఛాయా రంగు, బ్లాక్ అండ్ వైట్ హెయిర్, చీర బ్లూ కలర్ వైట్ వైట్ కలర్ చెక్స్ బ్లౌజ్, ఎడమ చేయి పై పుట్టుమచ్చ కలదు. రెండు చిన్న ముక్కుపుడకలు కలవు చెవులకు మూడు చోట్ల చిన్న చిన్న కమ్మలు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతి చెందిన మహిళ వివరాల కోసం.. సాధు లింబాద్రి రైల్వే ఎస్సై కామారెడ్డి సెల్ ఫోన్ నెంబర్ 87 126 58 614కు సంప్రదించాలని ఆయన కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.






