రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య!

by Vinod kumar |

దిశ, బెల్లంపల్లి: మందమరి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య - Unidentified man commits suicide by falling under train

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య!
X

దిశ, బెల్లంపల్లి: మందమరి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ సురేష్ గురువారం తెలిపారు. మందమర్రి బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఎగువ రైలు పట్టాల మధ్య 30 సంవత్సరాల వ్యక్తి చనిపోయి ఉన్నాడని తెలిపారు. సదరు వ్యక్తి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నట్లుగా ఆయన నిర్ధారించారు. అతని ఒంటిపై జీన్స్ ప్యాంట్ బ్రౌన్ కలర్ రెడీమేడ్ ఫుల్ షర్టు కలదు. ఎడమ భుజం పై పుట్టుమచ్చ కలదు. అతని వివరాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story