రాఘవ్ చద్దాకి ఊహించని షాక్.. ఆప్ రాజ్యసభ ఉప నాయకుడి పోస్టు నుంచి తొలగింపు

by Malleboina Mahesh |   (  Updated:2026-04-02 08:32:15  IST  )

రాజ్యసభ ఆప్ ఉప నాయకుడిగా రాఘవ్ చద్దా తొలగింపు? అశోక్ మిట్టల్ పేరు ప్రతిపాదన. ప్రసంగ సమయంపై ఆంక్షలు కోరుతూ ఆప్ లేఖ రాసిన పార్టీ

రాఘవ్ చద్దాకి ఊహించని షాక్.. ఆప్ రాజ్యసభ ఉప నాయకుడి పోస్టు నుంచి తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (AAP MP Raghav Chadha).. సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. కానీ ఆయను ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఈ రోజు ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీ రాజ్యసభ పక్ష ఉప నాయకుడి (Deputy Leader of the Rajya Sabha)గా ఉన్న రాఘవ్ చద్దాను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోరుతూ పార్టీ అధిష్టానం రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసింది. రాఘవ్ చద్దా స్థానంలో పంజాబ్‌కు చెందిన మరో ఎంపీ అశోక్ మిట్టల్ (LPU వ్యవస్థాపకుడు) పేరును పార్టీ ప్రతిపాదించింది.

అనుమానాలు - చర్చనీయాంశాలు

ఈ పరిణామం వెనుక ఉన్న కారణాలపై రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా, రాజ్యసభలో పార్టీకి కేటాయించే సమయంలో చద్దాను ప్రసంగించనివ్వవద్దని (No speaking time) కూడా పార్టీ కోరినట్లు సమాచారం అందడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి కూడా ఆయన పేరు తొలగించబడటం, పార్టీ అంతర్గత విభేదాల వల్లనా లేక ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నారా అనే కోణంలో చర్చ జరుగుతోంది.

Next Story