దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కిన నిరుద్యోగులు.. ఉద్రిక్తంగా మారిన వాతావరణం

by Malleboina Mahesh |

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొవాలని, వెంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌లోని దిల్‍సుఖ్‍నగర్ లో నిరుద్యోగులు రోడ్డెక్కారు.

దిల్‍సుఖ్‍నగర్‌లో రోడ్డెక్కిన నిరుద్యోగులు.. ఉద్రిక్తంగా మారిన వాతావరణం
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొవాలని, వెంటనే జాబ్ క్యాలెండర్ (Job calendar) విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌లోని దిల్‍సుఖ్‍నగర్ లో నిరుద్యోగులు రోడ్డెక్కారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా నిరసన కారుల నినాదాలతో అట్టుడికిపోయింది. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లను (Job Notifications) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో నిరుద్యోగులు (unemployed) రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని వారు నినాదాలతో హోరెత్తించారు.

ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు

నిరుద్యోగలు నిరసన కార్యక్రమంపై ముందస్తు సమాచారం ఉండటంతో పోలీసులు ఉదయం నుంచే దిల్‍సుఖ్‍నగర్ (Dilsukhnagar) చౌరస్తాలో భారీగా మోహరించారు. నిరుద్యోగులు ఆందోళనకు దిగగానే వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ముందస్తు మోహరింపు, అరెస్టుల పర్వంతో దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతం మొత్తం కాసేపు హైడ్రామా నడిచింది.

Next Story