Undavalli Arun Kumar: నేను బతికి ఉండగా ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
Undavalli Arun Kumar Says, Polavaram Project Wont be completed while Hes Alive
X

దిశ, వెబ్‌డెస్క్: Undavalli Arun Kumar Says, Polavaram Project Won't be completed while He's Alive| పోలవరం ప్రాజెక్ట్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉండగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం అసాధ్యమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లోని డయాఫ్రం వాల్ దెబ్బ తినడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. ఆ ఘటనకు బాధ్యలుగా ఎవరిపై చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులను ఆదుకోవాలని అన్నారు.

ఇది కూడా చదవండి:

చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ: CM Jagan

Next Story

Most Viewed