- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడలి అక్రమ సంబంధంపై నిలదీసినందుకు మామ దారుణ హత్య
కోడలి అక్రమ సంబంధంపై నిలదీసినందుకు మామ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దిశ, వెబ్ డెస్క్: కోడలి అక్రమ సంబంధంపై నిలదీసినందుకు మామ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒంటిమీద మంటలతో తనను కాపాడాలని రోడ్డుపై వెళ్తున్న వారిని బాధితుడు బ్రతిమిలాడటం స్పష్టంగా కనిపించింది. ఈ దారుణ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుటి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రన్ (64) అనే రైతు తన కొడుకు బి. జయప్రియ (28) అనే మహిళతో వివాహం చేశాడు. అయితే కొద్ది రోజుల క్రితం అతను రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి జయప్రియ, మణికందన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని సాగిస్తుంది. ఇది గమనించిన రాజేంద్రన్ (64) తీవ్రంగా వ్యతిరేకించాడు.
ఈ విషయంలో రాజేంద్రన్ తనను మందలించాడనే కోపంతో మణికందన్ అతడిని అంతం చేయాలని కుట్ర పన్నాడు. జనవరి 29 రాత్రి రాజేంద్రన్ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, మణికందన్ తన అనుచరులతో కలిసి వ్యాన్‌లో వచ్చి వారిని అడ్డుకున్నాడు. ఆపై రాజేంద్రన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటల్లో చిక్కుకున్న రాజేంద్రన్ ప్రాణభయంతో రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నలుగురు నిందితుల అరెస్ట్.. హత్య కేసుగా నమోదు
మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడిన రాజేంద్రన్‌ను స్థానికులు కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 70 శాతం గాయాలతో చికిత్స పొందుతూ ఆయన జనవరి 31 శనివారం రాత్రి మరణించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘోరానికి పాల్పడిన ప్రధాన నిందితుడు మణికందన్‌తో పాటు, అతడికి సహకరించిన కోడలు జయప్రియ, మణికందన్ అనుచరుడు గుబేంద్రన్, వ్యాన్ డ్రైవర్ పార్థిబన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత హత్యాయత్నం గా నమోదైన ఈ కేసును రాజేంద్రన్ మరణానంతరం హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
- Tags
- murder






