తేలికగా నమ్మలేం.. రష్యా ప్రతిపాదనలపై ఉక్రెయిన్ అధ్యక్షుడి స్పందన

by Disha Web Desk 17 |
తేలికగా నమ్మలేం.. రష్యా ప్రతిపాదనలపై ఉక్రెయిన్ అధ్యక్షుడి స్పందన
X

కీవ్: ఉక్రెయిన్ ముఖ్యనగరాలైన కీవ్, చెర్నిహివ్ నుంచి రష్యా బలగాలు నెమ్మదిగా ఉపసంహరించుకుంటాయన్న ప్రతిపాదనపై అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. రష్యా రాయబారులు సానుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ, సులభంగా వారిని నమ్మబోమని హెచ్చరించారు. వీడియో ప్రసంగంలో మాట్లాడుతూ.. 'ఉక్రేనియన్ దళాల ధైర్యవంతమైన, సమర్థవంతమైన చర్యలు రష్యాను కీవ్, చెర్నిహివ్ చుట్టూ తగ్గించేలా చేశాయి. ఉక్రెయిన్ చర్చలను కొనసాగిస్తుంది. మమ్మల్ని నాశనం చేయడానికి పోరాడుతున్న దేశ ప్రతినిధుల నుండి వస్తున్న పదాలపై అపనమ్మకం ఉందని చెప్పారు. అంతేకాకుండా ఉక్రెయిన్ సలహాదారులు ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడరు' అని నొక్కి చెప్పారు. మరోవైపు రష్యా చెప్పేది చేసే వరకు తాము కూడా నమ్మబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇక, క్షేత్రస్థాయిలో రష్యా చర్యలతో చర్చలు తెగిపోయినట్లే కనిపిస్తున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అన్నారు. ఉక్రెయిన్ తనంతట తానుగా కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఉత్తర ప్రాంతాల నుంచి పాక్షికంగా కాల్పులు తగ్గినట్లు తెలిపారు. యుద్ధం ఆపేందుకు పుతిన్ తో మాట్లాడేందుకు భారత్ ప్రయత్నించాలని ఆయన కోరారు.

ఆయుధసాయం చేయండి

ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి సాయం చేయాలని నార్వేను అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. నార్వే పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. స్వేచ్ఛ దౌర్జన్యం కంటే అధ్వాన్నంగా ఉండాలి. నేను ఈ కట్టుబాట్లలో నిర్ధిష్టంగా ఉంటాను. నన్ను నమ్మండి, మేము నిర్దిష్ట వ్యక్తులను కోల్పోతున్నాము, నిర్దిష్ట నగరాలు నాశనం చేయబడుతున్నాయి. నేను మీకు ఒకటి సూటిగా చెప్పదలుచుకున్నాను. సాయుధ వాహనాలు, ఫిరంగుల వ్యవస్థలను నాశనం చేయడానికి మాకు ఆయుధాలు కావాలి అని కోరారు. ముందు నుంచి ఉక్రెయిన్ కు సాయంగా నిలుస్తున్నందుకు నార్వేకు కృతజ్ఞతలు తెలిపారు.

నిరంతర మద్దతు ఇస్తాం

రష్యాతో యుద్ధ సంక్షోభ నేపథ్యంలో ఉక్రెయిన్ కు తమ మద్దతు నిరంతరం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో బైడెన్ మాట్లాడారు. 'యూఎస్ఏ యుద్ధ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్ కు తమ మద్దతు కొనసాగిస్తుంది' అని వైట్ హౌస్ ప్రకటన చేసింది.


Next Story

Most Viewed