- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UGC NET.. నేడే ఆఖరు ఛాన్స్
యూజీసీ నెట్ (UGC NET) జూన్ 2026 సెషన్‌కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

దిశ, వెబ్ డెస్క్ : యూజీసీ నెట్ (UGC NET) జూన్ 2026 సెషన్‌కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అయితే సాధారణ ఫీజుతో ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించే గడువు శనివారం (మే 23, 2026) రాత్రి 11:59 గంటలతో ముగిసింది. అయితే, అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల దృష్ట్యా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. మే 24వ తేదీ(ఆదివారం) ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా విండోను అందుబాటులో ఉంచింది. అలాగే ఫీజు పేమెంట్ కుడా నేటితో ముగియనుండగా.. కరెక్షన్స్ ఉంటే ఈనెల 26 నుంచి 28 వరకు అవకాశం కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.
చివరి నిమిషంలో దరఖాస్తుదారుల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల వెబ్‌సైట్ స్లో అయ్యే అవకాశం ఉందని అధికారులు సూచించారు. అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in/ను సందర్శించవచ్చని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ అర్హత పరీక్ష తేదీ షెడ్యూల్‌ను త్వరలోనే NTA ప్రకటించనుంది.






