- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు ఉగాది కానుక.. కొలువుల జాతరకు జాబ్ క్యాలెండర్ విడుదల
యువగళం హామీ నెరవేరుస్తూ 10,060 ఉద్యోగాలతో ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల. ప్రతి ఏటా ఉగాదికి నోటిఫికేషన్లు.. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్!

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ యువతకు ఈ ఏడాది ఉగాది పండుగ సరికొత్త ఉత్సాహాన్ని మోసుకొచ్చింది. నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో భారీ స్థాయిలో జాబ్ క్యాలెండర్ (Job Calendar)ను విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ తేదీలు, పోస్టుల వివరాలను కూటమి ప్రభుత్వం (coalition government) అధికారికంగా ప్రకటించింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిర్ణీత సమయంలోనే పరీక్షలు నిర్వహించి, పారదర్శకంగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి ఏటా 'ఉద్యోగాల పండగ': సిద్ధమవ్వండి మరి!
ముఖ్యంగా, ఇకపై ప్రతి ఏటా ఉగాది పర్వదినం సందర్భంగా 'ఉద్యోగాల ప్రకటన' ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడం నిరుద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. సిలబస్‌ను కూడా ముందుగానే వెల్లడించి, అభ్యర్థులు సన్నద్ధమవ్వడానికి తగిన సమయం కల్పిస్తామని హామీ ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుని అలర్ట్స్ పొందాలని సూచించింది. "నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను.. ఇక మీరు పోటీ పరీక్షలకు సిద్ధమై విజయం సాధించండి" అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర యువతకు పిలుపునిచ్చారు.






