- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్‌లో ఘనంగా "ఉద్వాసన డివైన్ కలెక్షన్ డ్రైవ్" నిర్వహణ
ఉద్వాసన డివైన్ కలెక్షన్ డ్రైవ్ కార్యక్రమాన్నిఉప్పల్ జోన్ పరిధిలోని స్వరూప్‌నగర్ శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు.

దిశ, ఉప్పల్ : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణతో పాటు సనాతన సంప్రదాయాలకు గౌరవం కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న "ఉద్వాసన డివైన్ కలెక్షన్ డ్రైవ్" కార్యక్రమాన్ని ఉప్పల్ జోన్ పరిధిలోని స్వరూప్‌నగర్ శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న దేవతా చిత్రపటాలు, విగ్రహాలు, పూజా సామగ్రి వంటి పవిత్ర వస్తువులను బహిరంగ ప్రదేశాల్లో లేదా చెత్తకుండీల్లో వేయకుండా, వాటిని గౌరవప్రదంగా సేకరించి శాస్త్రోక్తంగా ఉద్వాసన నిర్వహించడం ప్రతి భక్తుని బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక విలువలను కూడా కాపాడుతున్నామని ఆయన తెలిపారు. భక్తులు తమ వద్ద ఉన్న పాత, దెబ్బతిన్న దేవతా చిత్రపటాలు, విగ్రహాలు, పూజా సామగ్రిని "ఉద్వాసన డివైన్ కలెక్షన్ డ్రైవ్"కు అందజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవిత్ర వస్తువులను గౌరవప్రదంగా నిర్వహిస్తూ పరిశుభ్రమైన, హరిత నగర నిర్మాణానికి ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (శానిటేషన్), ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్, ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్‌డబ్ల్యూఎం), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్‌డబ్ల్యూఎం), శానిటేషన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.






