- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళంలో 'యూడీఎఫ్' మార్క్ పాలన.. ఈరోజే గవర్నర్‌కు మంత్రుల జాబితా
కేరళలో యూడీఎఫ్ కొత్త మంత్రివర్గ జాబితా ఈరోజు గవర్నర్‌కు అందుతుందని కె.సి. వేణుగోపాల్ తెలిపారు. రమేష్ చెన్నితాల క్యాబినెట్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి ఘన విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యూడీఎఫ్ సీఎం అభ్యర్థిగా వీడీ సతీశన్ ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. రేపు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో ఎఐసిసి (AICC) జనరల్ సెక్రటరీ, ఎంపీ కె.సి. వేణుగోపాల్ అలప్పుజలో మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యల చేశారు. కేరళ ప్రజలు మతతత్వ రాజకీయాలను ఎప్పటికీ ఆమోదించరని, ఈ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షమైన ముస్లిం లీగ్ (IUML) ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేస్తున్న దాడులు సామాజిక ఉద్రిక్తతలను పెంచేందుకేనని మండిపడ్డారు. యూడీఎఫ్ వ్యవస్థలో ఏ పార్టీ మరొకరిపై ఆధిపత్యం చలాయించదని, అందరూ పరస్పర గౌరవంతో, సర్వసమ్మతంగా ముందుకు సాగుతారని భరోసా ఇచ్చారు. కొత్త మంత్రివర్గంలో సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల చేరాలనేది పార్టీ నిర్ణయమని, కొత్త క్యాబినెట్‌లో అలప్పుజ జిల్లాకు బలమైన ప్రాతినిధ్యం లభించబోతోందని ఆయన వెల్లడించారు.
అలాగే కొత్త మంత్రుల తుది జాబితాను ఈరోజు సాయంత్రమే గవర్నర్‌కు సమర్పిస్తామని, ముందే పేర్లను ప్రకటించడం కాంగ్రెస్ సాంప్రదాయం కాదని వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా అత్యంత సమర్థులైన బృందంతో కూడిన క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తుందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని గ్యారెంటీలను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇదే సమయంలో, ప్రభుత్వం ఇంకా కొలువుదీరక ముందే ఎస్‌ఎన్‌డీపీ (SNDP) యోగం జనరల్ సెక్రటరీ వెల్లాపల్లి నటేశన్ ముఖ్యమంత్రి ఎంపికపై ఉద్రేకపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆయన అలాంటి ప్రకటనలను అవాయిడ్ చేసి ఉండాల్సిందని హితవు పలికారు. గత కొన్నేళ్లుగా అలప్పుజ జిల్లా కోల్పోయిన వైభవాన్ని, అభివృద్ధిని తిరిగి సాధించేందుకు తాను కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.






