- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఏఈపై ఇరాన్ దాడులు.. చమురు నష్టం ఒక్కటే కాదు అంతకుమించి!
ఇరాన్ దాడుల వల్ల యూఏఈ ఆర్థిక మూలాలపై భారీగా దెబ్బపడనుంది. ఒక్క చమురు రంగంలోనే కాకుండా వివిధ రంగాలు కుదేలవనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : యూఏఈ(UAE)పై ఇరాన్ జరిపిన దాడులు కేవలం చమురు నష్టాలకే పరిమితం కాలేదు. దుబాయ్, అబుదాబి వంటి నగరాలు ప్రపంచ ఆర్థిక కేంద్రాలు కావడంతో, ఈ దాడుల వల్ల కలిగే నష్టం ఊహించలేనంత భారీగా ఉంది. యూఏఈ ప్రపంచ దేశాలకు కేవలం పెట్రోల్ అమ్మే దేశం మాత్రమే కాదు. అది ప్రపంచ పర్యాటక (Tourism), విమానయాన (Aviation), రియల్ ఎస్టేట్ రంగాలకు చిరునామా. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఈ రంగాలపై పడిన ప్రభావం అత్యంత దారుణంగా ఉంది.
కుప్పకూలనున్న దుబాయ్ ఎకానమీ
ప్రధానంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) వంటి బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు మూతపడటం వల్ల రోజుకు సుమారు 100 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని యూఏఈ కోల్పోతోంది. విమానాల దారి మళ్లింపు, రద్దుల వల్ల ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ వంటి విమానయాన సంస్థల షేర్లు కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తమ బుకింగ్స్‌ను రద్దు చేసుకోవడం వల్ల హోటల్, టూరిజం రంగం సుమారు రూ.16,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ అయిన దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీయులు ఈ దాడుల వల్ల వెనకడుగు వేస్తున్నారు. యుద్ధ భయంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) ఒక్కసారిగా ఆగిపోయాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్ విలువలో 15% నుండి 20% వరకు పతనం నమోదయ్యే అవకాశం ఉంది.
"గ్లోబల్ హబ్" ఇమేజ్‌కి మచ్చ
అలాగే యూఏఈ తన రక్షణ వ్యవస్థలైన 'థాడ్' (THAAD), 'పేట్రియాట్' క్షిపణులను ప్రయోగించడానికి ఒక్కో క్షిపణికి 2 మిలియన్ల నుండి 4 మిలియన్ల డాలర్ల వరకు ఖర్చు చేస్తోంది. అంటే కేవలం శత్రువుల డ్రోన్లను అడ్డుకోవడానికే యూఏఈ ప్రభుత్వం రోజుకు వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్టు, సముద్ర మార్గంలో వచ్చే సరుకుల మీద బీమా ప్రీమియంలు(Insurance Premiums) 500% పెరగడం వల్ల దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది కేవలం చమురు సంక్షోభం కాదు, యూఏఈ నిర్మించుకున్న "గ్లోబల్ హబ్" ఇమేజ్‌కే పెద్ద దెబ్బ అని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.






