- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: హన్మకొండలో ఘోర ప్రమాదం.. ముగ్గురు కూలీలు స్పాట్ డెడ్
దిశ,శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న అశోక్ ట్రాలీ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది.

దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న అశోక్ ట్రాలీ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది మహిళా కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో మిర్చీ తోటలో పనికి వెళ్లేందుకు ట్రాలీ వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ సైడ్ నుంచి తగిలి, ట్రాలీలో సైడ్‌కు నిలబడిన కూలీలందరినీ గుద్దుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ కాగా, మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న శాయంపేట ఎస్ఐ వీరభద్రరావు, పరకాల ఏసీపీ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎంకు అదే ట్రాలీలో తరలించారు.






