చిరుతపులి కలకలం.. రాత్రయితే అక్కడకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు..

by Disha Web Desk 19 |
చిరుతపులి కలకలం.. రాత్రయితే అక్కడకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు..
X

దిశ, కామారెడ్డి రూరల్: చిరుత పులి దాడి చేయడంతో రెండు గేదెలు మృతి చెందిన ఘటనకామారెడ్డి మండలం కొట్టాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కొట్టాలపల్లికి చెందిన కల్లూరి శంకర్ పశువులను తన చేనులో కట్టి వేశాడు. అయితే, శనివారం రాత్రి చిరుతపులి గేదెల కొట్టంలోకి దూరి రెండు గేదెలపై దాడి చేసి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని పేర్కొన్నారు. చిరుతను పట్టడానికి బోను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కాగా, వారం రోజుల క్రితం పక్కనే గల రాజంపేటలో సైతం పశువులపై చిరుత పులి దాడి చేసినట్లు గ్రామస్తులు వెల్లడించారు. రాత్రి వేళల్లో పంటపొలాల్లో చిరుతపులి సంచరిస్తుండడంతో.. రాత్రయితే రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుతున్నారు.


Next Story

Most Viewed