విరాట్ ఔట్ ట్వీట్ వైరల్.. ముందే మొత్తం చెప్పేసిన నెటిజన్..

by Disha Web Desk 19 |
విరాట్ ఔట్ ట్వీట్ వైరల్.. ముందే మొత్తం చెప్పేసిన నెటిజన్..
X

దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో శ్రీలంకతో మొహాలీలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రన్ మెషిన్ విరాట్కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైంది. దీనికి కారణం.. ఈ మ్యా్చ్ కోహ్లీకి 100వ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ కావడమే. అయితే, విరాట్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ 100వ టెస్ట్‌లో సెంచరీ చేయాలని విరాట్ అభిమానులు ఎంతోగానో ఆశపడ్డారు. కానీ, కోహ్లీ 45 పరుగులకే ఔట్ అవ్వడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇదిలా ఉంటే.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ ఔట్ అయిన తీరు గురించి సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. 'విరాట్ ఈ మ్యాచ్‌లో 45 పరుగులు చేసి ఎంబుల్దెనియా బౌలింగ్‌లో ఔట్ అవుతాడని.. సెంచరీ చేయడని' ఈ ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా, శృతి అనే అకౌంట్ నుండి ఈ ట్వీట్ పోస్ట్ అయింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫ్యాబ్రికేటెడ్ ట్వీట్ అని కొందరు నెటిజన్ల్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story