- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ల్యాండింగ్ సమయంలో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!
నేపాల్‌లోని ఖాట్మండు విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తతతో 289 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ల్యాండింగ్ సమయంలో విమానంలో మంటలు చెలరేగడం సంచలనంగా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఇస్తాంబుల్ నుండి ఖాట్మండుకు వస్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ (TK 726) విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో దాని టైర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రన్‌వేపై విమానం దిగుతుండగా మంటలు రావడాన్ని గమనించిన పైలట్లు మరియు విమానాశ్రయ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాశ్రయ అగ్నిమాపక యంత్రాలు వెనువెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం సంభవించకుండా నివారించగలిగారు.
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 278 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఐక్యరాజ్యసమితికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానంలోని ప్రయాణికులందరినీ అత్యవసర ద్వారాల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఎస్పీ రాజ్‌కుమార్ సిలావాల్ వెల్లడించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కాసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






