- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణ కొరియాకు ట్రంప్ షాక్.. దిగుమతి సుంకాలు 25 శాతానికి పెంపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో దేశానికి ఊహించని షాక్ ఇచ్చాడు. గత కొంత కాలంగా, మిత్ర, శత్రు దేశాలనే తేడా లేకుండా.. సుంకాలు విదిస్తున్న ట్రంప్.. తాజాగా దక్షిణ కొరియా టారిప్స్ బాంబు పేల్చాడు.

Trump imposes add 10% global tariff after reacting to tariff ruling
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో దేశానికి ఊహించని షాక్ ఇచ్చాడు. గత కొంత కాలంగా, మిత్ర, శత్రు దేశాలనే తేడా లేకుండా.. సుంకాలు విదిస్తున్న ట్రంప్.. తాజాగా దక్షిణ కొరియా టారిప్స్ బాంబు పేల్చాడు. ఆ దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను (Tariffs) భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న 15 శాతం సుంకాన్ని ఏకంగా 25 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రకటించారు. చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని దక్షిణ కొరియా శాసనసభ ఆమోదించకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణ కొరియా నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఆటోమొబైల్స్, కలప, ఫార్మా ఉత్పత్తులతో పాటు ఇతర కీలక వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. 2024 గణాంకాల ప్రకారం, దక్షిణ కొరియా దాదాపు 132 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. తాజా నిర్ణయంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది.
వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన
వాస్తవానికి గత జూలైలో కుదిరిన ఒప్పందం ప్రకారం దక్షిణ కొరియాపై 15 శాతం సుంకాలు మాత్రమే విధిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. దానికి బదులుగా అమెరికా నియంత్రణలో ఉండే పెట్టుబడుల కోసం దక్షిణ కొరియా 350 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించిందని ఆయన అప్పట్లో తెలిపారు. అయితే తాజాగా కొరియా శాసనసభ నుండి ఆశించిన స్పందన రాకపోవడంతో ట్రంప్ తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తుంది. గతంలో కెనడా, యూరప్ దేశాల విషయంలోనూ ఇలాంటి సుంకాల హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్, ఇప్పుడు కొరియా విషయంలో పట్టుదలగా ఉన్నారు. మరోవైపు, కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా ఇలాంటి సుంకాలు విధించే అధికారం ఉందా లేదా అనే అంశంపై అమెరికా సుప్రీంకోర్టులో న్యాయపరమైన విచారణ జరుగుతుండటం గమనార్హం.






