BIG BREAKING NEWS : డెడ్ లైన్ పొడిగించిన ట్రంప్

by Muthe.Rajitha |   (  Updated:2026-04-08 00:25:43  IST  )

తమతో డీల్ చేసుకోడానికి ఇరాన్ కు విధించిన గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడిగించారు.

BIG BREAKING NEWS : డెడ్ లైన్ పొడిగించిన ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్ : తమతో డీల్ చేసుకోడానికి ఇరాన్ కు విధించిన గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడిగించారు. ఇరాన్ కు విధించిన డెడ్ లైన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేస్తున్నట్టు అంగీకరించారు. అయితే హార్మూజ్ ను తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకునే షరతు మీదనే ఈ గడువు పొడిగించానని, ఈ సీజ్ ఫైర్ రెండువైపులా వర్తిస్తుందని, ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్ పై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థలు బ్రేకింగ్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. కాగా మంగళవారం సాయంత్రం "ఒక సంపూర్ణ నాగరికత ఈ రాత్రి నాశనం కావచ్చు, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు" అంటూ ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని వణికించాయి. మూడో ప్రపంచ యుద్ధం జరగనుందని అంతా భయపడగా.. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మరోవైపు తమ ప్రతిపాదనలకు అమెరికా సుముఖంగా ఉండటంతో ఇరాన్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించిందని సమాచారం.

Next Story