లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

by Javid Pasha |

లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. తెలంగాణలో ధాన్యం సేకరణపై చర్చించాలని డిమాండ్ చేసినప్పటికీ ఉభయ సభల్లో చర్చ జరగకపోవడంతో ఎంపీలు వాకౌట్ చేశారు. ఉప్పుడు బియ్యం కొనుగోళ్ల అంశంపై సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ తిరస్కరించారు. కేంద్రం తీరుకు నిరసనగా నినాదాలు చేసిన ఎంపీలు.. రాష్ట్రంలో వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంతోనే వాకౌట్ చేస్తున్నట్లు ఎంపీ సురేశ్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Next Story