- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RRR కొమురం భీముడో సాంగ్‌పై ట్రోల్స్.. మీమ్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్- latest Telugu news

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదలైన 5 రోజుల్లోనే 600 కోట్లకు పైగా కలెక్షన్‌లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే, ఈ సినిమాలో 'కొమురం భీముడో' సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఈ పాటలో ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఆయన అభిమానులే కాకుండా.. సినీ ప్రేమికులు అంతా ఫిదా అయ్యారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొందరైతే ఈ సాంగ్ చూసుకుంటూ థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సాంగ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మీమ్‌లో తల్లి కొడుకుతో మాట్లాడుతూ.. 'చూడు రా.. రాంచరణ్ ఎన్టీఆర్‌ను కొరడాతో కొట్టిన సరే.. పాట ఎంత బాగా పాడుతున్నాడో.. నువ్వు ఉన్నావ్ ఎందుకు మీ నాన్న నిన్ను బెల్ట్‌తో కొట్టగానే పందిలా అరుస్తావ్ వెధవ' అంటూ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు.. పలువురికి నవ్వులు పూయిస్తోంది.






