అతడి విషయంలో ఫెయిలైన త్రివిక్రమ్.. మరి ఈసారైనా..??

by Web Desk |
అతడి విషయంలో ఫెయిలైన త్రివిక్రమ్.. మరి ఈసారైనా..??
X

దిశ, వెబ్‌డెస్క్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'భీమ్లా నాయక్'తో భారీ హిట్ అందుకున్నాడు. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ విషయంలో మాత్రం ఫెయిలయ్యాడనే చెప్పుకోవాలి. టాలీవుడ్ టాప్ కమెడియన్ సునీల్, త్రివిక్రమ్ సినిమాల్లోకి రాకముందు నుంచే మంచి స్నేహితులు. వీరిద్దరు ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత సునీల్ కోసం త్రివిక్రమ్ అద్భుతమైన పాత్రలు రాశాడు. 'నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మళ్లీశ్వరి' ఇలాంటి మరిన్ని సినిమాలతో సునీల్ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. అయితే 2000 సంవత్సరం నుంచి సునీల్ హీరోగా అవతారమెత్తాడు. హీరోగా ముందు బాగానే రాణించినా తర్వాత అనుకున్నంత స్థాయిలో హిట్‌లు అందుకోలేక పోయాడు. దాంతో సునీల్ మళ్లీ సపోర్టింగ్ పాత్రలకు వచ్చాడు.

అయితే సునీల్ రిటర్న్ తర్వాత త్రివిక్రమ్ తన సినిమాలు 'అరవింద సమేత, అలా వైకుంఠపురములో, భీమ్లా నాయక్' సినిమాల్లో సునీల్‌కు అవకాశాలు ఇచ్చాడు. కానీ ఈ సినిమాలతో సునీల్‌కు ఒరిగిందేమీ లేదు. సునీల్‌ను నిలబెట్టడంలో ఈ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో సునీల్ విషయంలో త్రివిక్రమ్ ఫెయిల్ అయ్యాడని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. అంతేగాకుండా 'భీమ్లా నాయక్' సినిమాలో సునీల్ గెస్ట్ రోల్‌గా ఓ పాటలో కనిపిస్తాడు. నిజానికి ఈ మూవీలో సునీల్ రోల్ ఉందని, కానీ ఆ సీన్స్‌ను ఎడిటింగ్ టైంలో కట్ చేసేశారని టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఖరారు చేశాడు. మరి ఈ సినిమాలో అయినా సునీల్‌ను మళ్లీ నిలబెట్టే రేంజ్ పాత్ర ఏదైనా ఇస్తాడేమో చూడాలి.


Next Story

Most Viewed