- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోదరి అస్థిపంజరాన్ని బ్యాంకుకు మోసుకొచ్చిన గిరిజనుడు.. స్పందించిన సబ్ కలెక్టర్
నిబంధనల పేరుతో తిప్పలు! సోదరి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తెచ్చిన గిరిజనుడు. ఒడిశాలో వెలుగుచూసిన హృదయ విదారక ఘటన. స్పందించిన సబ్ కలెక్టర్

దిశ, వెబ్ డెస్క్: చనిపోయిన తన సోదరి బ్యాంకు ఖాతా నుంచి నగదు తీసుకోవడానికి పత్రాలు లేకపోవడంతో, తీవ్ర ఆవేదనకు గురైన ఒక గిరిజన వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగినట్లు అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. జీతూ ముండా అనే గిరిజన వ్యక్తి సోదరి కొంతకాలం క్రితం మరణించింది.
ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును పొందేందుకు జీతూ ప్రయత్నించగా, బ్యాంకు అధికారులు మరణ ధ్రువీకరణ పత్రం (Death Certificate), వారసత్వ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని కోరారు. అయితే, ఆ నిబంధనల గురించి అవగాహన లేని జీతూ, తన మాట నమ్మడం లేదని భావించి.. నిస్సహాయ స్థితిలో తన సోదరి అస్థిపంజరాన్ని సమాధి నుంచి తవ్వుకొని సాక్ష్యంగా బ్యాంకుకు తీసుకువచ్చాడు.
అధికారుల స్పందన..
ఈ ఘటనపై కియోంజర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ దలై స్పందిస్తూ.. "బాధితుడికి ప్రభుత్వ నిబంధనల పట్ల అవగాహన లేకపోవడం, తీవ్ర నిరాశ తో ఈ పని చేశాడని తెలిపారు. సాంకేతికంగా ఆయన తన సోదరికి 'క్లాస్-1' వారసుడు కాకపోవడంతో బ్యాంకు పత్రాలు అడిగింది. ప్రస్తుతం మేము ఆయనకు డెత్ సర్టిఫికేట్, లీగల్ హెయిర్ సర్టిఫికేట్‌తో పాటు రెడ్ క్రాస్ ద్వారా రూ. 20,000 తక్షణ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాము" అని తెలిపారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి ఖాతాల్లోని నగదును త్వరగా విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.






