- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్‌ఫార్మర్‌లు ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ
by Jakkula.Mamatha |
మండలంలో కాపర్ వైర్ దొంగలు మరోసారి హల్చల్ చేశారు.

X
దిశ, నేలకొండపల్లి: మండలంలో కాపర్ వైర్ దొంగలు మరోసారి హల్చల్ చేశారు. పైనంపల్లి గ్రామ శివారులోని ఖమ్మం కోదాడ హైవే సమీపంలోని పొలాల్లో రైతుల 2 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను పగలకొట్టి మరీ కాపర్ వైరును చోరీ చేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వానాకాలం వ్యవసాయ సీజన్ మొదలైన సమయంలో దొంగల చర్యలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా రాజేశ్వరపురం, చెన్నారం, అమ్మగూడెం గ్రామాలలో పాటు మండల వ్యాప్తంగా సీరియల్ గా ట్రాన్స్‌ఫార్మర్‌లలో కాపర్ వైరు చోరీలు జరిగాయని, పోలీసులు ఈ తరహా దొంగతనాలపై ఇకనైనా దృష్టి సారించాలని కోరుతున్నారు. నేలకొండపల్లి విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించారు.
Next Story






