- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ఉద్యోగుల బదిలీలు వాయిదా.. రిలే దీక్షలను విరమించిన జేఏసీ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ జేఏసీ (JAC) చేపట్టదలచిన రిలే నిరసన దీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నేతలు ఇవాళ ప్రకటించారు. బదిలీల ఉత్తర్వులు (Transfer Orders) రద్దయినట్లు మీడియాతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందిందని జేఏసీ నాయకులు సాయిబాబా, శ్రీధర్, అంజన్న, జాన్సన్, శివాజీ, రత్నాకర్ రావు వెల్లడించారు. అయితే, ఈ విషయంలో యాజమాన్యం లేదా ఉన్నతాధికారులు నేరుగా స్పందించేందుకు గానీ, అధికారికంగా సమాచారం ఇచ్చేందుకు గానీ సుముఖంగా లేరని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి రానున్న దృష్ట్యా, సాంకేతిక కారణాలతో ఈ బదిలీలను నిలిపివేసినట్లు అనధికారికంగా తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం సానుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నందున, ప్రస్తుతానికి తమ నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది.






