సాంబ జిల్లాలో విషాదం.. బిఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య

by Malleboina Mahesh |

సాంబ జిల్లాలో ఉరివేసుకుని హెడ్ కానిస్టేబుల్ హరి బాబు మృతి. యూపీకి చెందిన జవాన్ బలవన్మరణంపై పోలీసుల దర్యాప్తు.

సాంబ జిల్లాలో విషాదం.. బిఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లోని సాంబ జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఒక బీఎస్ఎఫ్ (BSF) జవాన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని పెంథి ప్రాంతంలో ఉన్న బీఎస్ఎఫ్ క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ హరి బాబు తన పోస్ట్ వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. క్యాంపులోని సహచర జవాన్లు ఆయనను గమనించే లోపే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం మరియు ఇతర చట్టపరమైన లాంఛనాల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. హరి బాబు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలా లేక విధి నిర్వహణలో ఒత్తిడి ఏమైనా ఉందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story