ఒలింపియన్ పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం.. భర్త శ్రీనివాసన్ హఠాన్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-30 03:41:56  IST  )

భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ పీటీ ఉష ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఒలింపియన్ పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం.. భర్త శ్రీనివాసన్ హఠాన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ పీటీ (PT Usha) ఉష ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్ (67) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున శ్రీనివాసన్ తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే శ్రీనివాస్ మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు.

శ్రీనివాసన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. స్వయంగా కబడ్డీ క్రీడాకారుడైన ఆయన 1991లో పీటీ ఉషను వివాహం చేసుకున్నారు. వారికి విఘ్నేష్ ఉజ్వల్ (Vignesh Ujwal) కుమారుడు ఉన్నారు. క్రీడా జీవితంలో ఆమె నడుపుతున్న ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ (Usha School of Athletics) అభివృద్ధిలో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించారు. శ్రీనివాసన్ ఆకస్మిక మృతి పట్ల పలువురు క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పీటీ ఉష సాధించిన విజయాల వెనుక ఆయన నిరంతర ప్రోత్సాహం ఉందని క్రీడాలోకం కొనియాడుతోంది.

Next Story