- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలయాళ చిత్రసీమలో విషాదం: ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ. రాజేంద్రన్ కన్నుమూత
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ఇ.ఏ. రాజేంద్రన్ (71) కన్నుమూశారు. 'నరసింహం' వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆయన మృతికి కేరళ సీఎం సహా పలువురు సంతాపం తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: మలయాళ నాటక, సినీ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ. రాజేంద్రన్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కొల్లంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) గ్రాడ్యుయేట్ అయిన రాజేంద్రన్, కేరళలోని ప్రసిద్ధ నాటక సంస్థ 'కాళిదాస కళాకేంద్రం లో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కేరళ నాటక, సాంస్కృతిక రంగానికి ఇది తీరని లోటు అని కొనియాడారు.
రాజేంద్రన్ సుమారు 60కి పైగా మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా 'నరసింహం', 'మీశమాధవన్', 'కలియాట్టం' వంటి సూపర్ హిట్ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయి. ఈయన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ముఖేష్‌కు స్వయానా బావగారు. రాజేంద్రన్ భార్య సంధ్య, కుమారుడు దివ్యదర్శన్ కూడా చిత్ర పరిశ్రమలో నటులుగా కొనసాగుతున్నారు. ఆయన పార్థివ దేహాన్ని రేపు త్రిసూర్ జిల్లాలోని త్రిత్తల్లూర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.






