- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ పరీక్షా కేంద్రంలో విషాదం.. టాయ్‌లెట్‌లో మృత శిశువుకు జన్మనిచ్చిన విద్యార్థిని!
ఇంటర్ పరీక్షా కేంద్రంలో విద్యార్థిని టాయ్‌లెట్‌లో మృత శిశువును ప్రసవించింది. పరువు భయంతో శిశువును బేసిన్‌లో దాచినట్లు బాలిక అంగీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మైనర్ విద్యార్థి (minor student) టాయ్‌లెట్‌లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వెలుగుచూసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక, పరీక్షా కేంద్రంలోని మరుగుదొడ్డిలో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి వచ్చిన ఆ విద్యార్థిని, పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికే ఇన్విజిలేటర్ అనుమతి తీసుకుని టాయ్‌లెట్‌కు వెళ్లింది. అయితే, ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది.
మరుగుదొడ్డి నుంచి బయటకు వస్తున్న బాలిక నడకలో తడబాటు ఉండడాన్ని గమనించిన పరీక్షా కేంద్రం సిబ్బంది, లోపలికి వెళ్లి చూడగా బాత్రూం బేసిన్‌లో మృత శిశువు పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. సమాజంలో పరువు పోతుందనే భయంతోనే తాను ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బేసిన్‌లో కుక్కినట్లు సదరు మైనర్ బాలిక విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. విద్యాసంస్థల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.






