- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఇదీ పరిస్థితి (వీడియో)
హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. స్కూళ్లకు సెలవులు రావడంతో సంక్రాంతి పండక్క ఊరెళ్లే వారంతా మెల్లగా రోడ్ల మీదకు రావడంతో దారులన్నీ కిక్కరిసిపోయాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీ స్థాయిలో పెరిగింది. శనివారం సాయంత్రం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాల నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని.. గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్‌లో కూడా రద్దీ పెరిగింది. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక కూడళ్లు సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.






