ఆ ముఠానాయకుడు ఎవరు.. కేటీఆర్‌కు తెలియకుండా ఈ దోపిడీ సాధ్యమా?

by GSrikanth |
ఆ ముఠానాయకుడు ఎవరు..  కేటీఆర్‌కు తెలియకుండా ఈ దోపిడీ సాధ్యమా?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నడిబొడ్డున సంపన్నులు నివసించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో రెండువేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుండగానే లే అవుట్‌కు అనుమతి లభించింది. దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) అధికారులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. దీనిపై ఓ దిన పత్రిలో వచ్చిన కథనాన్ని పోస్టు చేస్తూ.. టీపీసీసీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ''నగరం నడిబొడ్డున రూ.2000 కోట్ల దోపిడీ వెనుక ఉన్న ముఠానాయకుడు ఎవరు?, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు తెలియకుండా ఈ దోపిడీ సాధ్యమా?, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు లేకుండా సీఎస్, మున్సిపల్ కమిషనర్‌లు ఇంతలా బరితెగించగలరా?, సర్వే నెంబర్ 327లో లే ఔట్ అనుమతులు రద్దు చేయాలి. ప్రభుత్వ భూమిని కాపాడాలి.'' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.





Next Story