రాష్ట్రంలో కాంగ్రెస్ దే మళ్లీ అధికారం : టీపీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్

by Muthe.Rajitha |

రాష్ట్రంలో కాంగ్రెస్ దే మళ్లీ అధికారమని టీపీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ దే మళ్లీ అధికారం : టీపీసీసీ చీఫ్​ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మళ్లీ అధికారం కాంగ్రెస్ పార్టీదే నని, బీఆర్ఎస్ నాలుగు ముక్కలైంది..బీజేపీ తెలంగాణలో చోటలేదని టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దళితలను బీజేపీ బంగారు లక్ష్మణ్ ను బీజేపీ, డిప్యూటీ సీఎం రాజయ్యను కేసీఆర్ అవమానించారని, కాంగ్రెస్ పునాదిలోనే దళిత వాదం ఉందని ఆయన చెప్పారు. టీపీసీసీ ఎస్సీ విభాగ చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పదవి బాధ్యతలు చేపట్టే కార్యక్రమం గురువారం గాంధీభవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రెడ్డికి సీఎం, బీసీకి పీసీసీ అధ్యక్ష పదవి, దళితులు డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవి, నాలుగు మంత్రి పదవులు కేవలం కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యమని, డీసీసీ అధ్యక్షుల నియమాకంంలోనూ ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాబోయే ఎన్నికల్లో కవ్వంపల్లి సూచించిన వారికే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు వస్తాయని, ఎస్సీ విభాగాన్ని పార్టీలో శక్తి వంతంగా తయారు చేయాలని ఆయన సూచించారు. రాబోయే పదవుల పంపకాల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, సభ్యత్వ కార్యక్రమంలో రోజుకు 100 మంది చేరేలా కృషి చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

అన్నింటిలో ఎస్సీలకు 18శాతం రిజర్వేషన్ ఇవ్వాలి : మంత్రి వివేక్ వెంకట స్వామి

అన్నింటి లో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ పెంచాలని, బడ్జెట్ లో 18శాతం కేటాయించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాలో ఎస్సీ రైతులకు తక్కువ లబ్ధిచేకూరుతోందని, సబ్సిడీలను కూడా త్వరగా మంజూరు చేయించేలా వ్యవహారించాల్సి ఉందన్నారు. కాంట్రాక్ట్స్ లో దళితులకు అవకాశం ఇవ్వాలని, కార్పొరేషన్ పదవుల్లో 18శాతం దళితులకు చైర్మన్ పదవులు ఇవ్వాలని వివేక్ వెంకటస్వామి సూచించారు.

రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలి : మంత్రి అడ్లూరి

ఎస్పీ సెల్ కాంగ్రెస్ కు గుండెకాయ లాంటిదని, కాంగ్రెస్ అధికారంలో కి రావడానికి దళితులే కారణమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్ చెప్పారు. రాబోయే మూడు సంవత్సరాలలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వస్తుందని, దాని కోసం మనం కృషి చేయాలన్నారు. దళితులకు ఏ కష్టం వచ్చినా అన్నగా మీకు అండగా ఉంటానని మంత్రి లక్ష్మణ్​కుమార్ హామీ ఇచ్చారు.

పదవుల్లో, కమిటీల్లో దళితులకు 18శాతం ఇవ్వాలని : టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, కవ్వం పల్లి సత్యనారాయణ

సీఎం రేవంత్ రెడ్డి ఆయాశయాలను ముందుకు తీసుకపోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని, పదవుల్లో, కమిటీల్లో దళితులకు 18శాతం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. దళితులు కాంగ్రెస్ కి అండగా ఉన్నందుకే గెలిచిందన్నారు. తెలంగాణలోని ప్రతి దళిత వాడలో ప్రతి దళితుడు సభ్యత్వం తీసుకోవాలని, రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్సీ నేతలకు సరైన ప్రాతినిధ్యం ఉందని కవ్వంపల్లి చెప్పారు.

మాల, మాదిగ ఉప కులాల కలిసి ఉన్నంత కాలం రేవంత్ రెడ్డే సీఎం : మోత్కుపల్లి నర్సింహులు

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కావడమే రేవంత్ రెడ్డి చేసుకున్న పుణ్యం, మనకు వరం..రిజర్వేషన్ ఇచ్చే దమ్ము ఎవరికి లేదు రేవంత్ రెడ్డికి తప్ప అని కొనియాడారు. మాల, మాదిగ ఉప కులాల కలిసి ఉన్నంత కాలం రేవంత్ రెడ్డే సీఎం అని, చీలక వస్తేనే ప్రాబ్లమ్ వస్తుందన్నారు. దళిత వర్గాలు కలిసి ముందుకు పోయాయి కాబట్టే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మోత్కుపల్లి చెప్పారు. సభలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నది. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడే సమయంలో చప్పట్లు కొట్టమని పార్టీ శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి వివేక్ చప్పట్లు కొట్టడం లేదని నర్సింహులు అనగానే, వివేక్ మోత్కుపల్లి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ తనను ఎప్పుడు మోత్కుపల్లి విమర్శిస్తుంటారని, అట్లా అయితే తాను ఆయన్ని ఎట్లా కలవగలనని చెప్పారు. రాష్ట్రంలోని మాలలకు న్యాయం జరగాలనే తాను మాట్లాడుతుంటానని వివేక్ తెలిపారు.

Next Story