Tollywood Heroes: ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ అగ్ర హీరోలు.. ఆకట్టుకుంటోన్న బ్యూటిఫుల్ పిక్

by Kodari Anjali |   (  Updated:2024-11-08 03:26:59  IST  )

సాధారణంగా ఏ పార్టీ, ఫంక్షన్‌లోనైనా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కనిపిస్తే మన తెలుగు వారి సంతోషమే వేరు.

Tollywood Heroes: ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ అగ్ర హీరోలు.. ఆకట్టుకుంటోన్న బ్యూటిఫుల్ పిక్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఏ పార్టీ, ఫంక్షన్‌లోనైనా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కనిపిస్తే మన తెలుగు వారి సంతోషమే వేరు. అలాంటిది టాలీవుడ్ లోని సెలబ్రిటీలు.. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న కథానాయకులు ఒకే చోట కనిపిస్తే ఆ కిక్కు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. తాజాగా మన తెలుగు స్టార్ హీరోలు కలిసున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ హీరోలంతా కలిసి మాల్దీవ్స్‌(Maldives)లో ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వ్యక్తి ప్రైవేట్ పార్టీకి ఇన్వైట్ చేయడంతో వీరంతా హాజరై సందడి చేసినట్లు తెలుస్తోంది. కాగా మాల్దీవ్స్ లో టాలీవుడ్ అగ్ర హీరోలు(Tollywood top heroes) డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని తింటున్నారు.

మరీ ఈ ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..? అక్కినేని హీరో నాగార్జున(Nagarjuna), మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan) తో పాటు ఉపాసన(upasana), మహేష్ సతీమణి నమ్రత(Namrata) కూడా కనిపించారు. ఇలా పలువురు స్టార్స్ అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో నెట్టింట ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది. పైగా మెగాస్టార్, నాగార్జున, ప్రిన్స్ మహేష్ బాబు ఒకే దగ్గర కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తుండటంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఫొటోను ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు.

Next Story