Today's horoscope:నేటి(29-05-2026) రాశి ఫలాలు.. ఆ రాశుల వారు కోపాన్ని తగ్గించుకోకపోతే కష్టమే!

by Jakkula.Mamatha |

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు(శుక్రవారం) గ్రహాల సంచారం కారణంగా రాశి చక్రములోని 12 రాశుల ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Todays horoscope:నేటి(29-05-2026) రాశి ఫలాలు..  ఆ రాశుల వారు కోపాన్ని తగ్గించుకోకపోతే కష్టమే!
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు(శుక్రవారం) గ్రహాల సంచారం కారణంగా రాశి చక్రములోని 12 రాశుల ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయాలంటే ఏకాగ్రత, చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలపై సమయాన్ని వృథా చేయకుండా మీ లక్ష్యం పై దృష్టి పెట్టండి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. శివారాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృషభ రాశి

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా సంతృప్తికరమైన పరిస్థితులు ఉంటాయి. ఆప్తులతో, కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ భాగస్వామి వైఖరి ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

మిథున రాశి

మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందుతారు. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు లాభదాయకంగా మారుతాయి. శారీరక శ్రమ కొంత పెరిగినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. అనవసర వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈశ్వర ధ్యానం లేదా శ్లోక పఠనం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి

ఉత్సాహంతో పని చేస్తే ఫలితాలు సానుకూలంగా మారుతాయి. పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. కార్యాలయాల్లో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే మీపై గౌరవం పెరుగుతుంది. తక్కువ మాట్లాడటం మంచిది. శ్రీరామ నామ స్మరణ మనోబలాన్ని పెంచుతుంది.

సింహ రాశి

చక్కటి ఆలోచనలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు ఈ రోజు పరిష్కారం దొరుకుతుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. అయితే కుటుంబంలో చిన్నపాటి అసౌకర్యాలు వచ్చినప్పుడు సహనంతో వ్యవహరించడం అవసరం. గణపతి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.

కన్య రాశి

ఈ రోజు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. బంధుత్వాలు బలపడతాయి. వస్త్రప్రాప్తి, వాహన సౌఖ్యం కలిగే సూచనలు ఉన్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ పనులను ఇతరులకు పూర్తిగా అప్పగించవద్దు, మీరే పర్యవేక్షించుకోండి.

తులా రాశి

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. సమయపాలనతో పనులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా ధైర్యం పెరిగి మనసుకు తృప్తి కలుగుతుంది. విష్ణు ఆలయ దర్శనం లేదా విష్ణు స్మరణ శుభప్రదం.

వృశ్చిక రాశి

కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి వచ్చే ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. అయితే వ్యాపార లేదా వ్యవహార ఒప్పందాలు చేసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ధనుస్సు రాశి

ఈ రోజు మీరు అవిశ్రాంతంగా శ్రమిస్తారు, అయితే మీ కష్టం వృథా పోదు. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీ మాటలు లేదా వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోవడం మంచిది.

మకర రాశి

ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణ పరిస్థితులు ఉంటాయి. గతంలో ఆగిపోయిన పనులు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. ఇంటి వద్ద లేదా పని స్థలంలో ఒత్తిడి మిమ్మల్ని కోపానికి గురిచేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి, కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

కుంభ రాశి

మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేరే అనుకూల సమయం. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు వ్యాపారానికి లేదా ఉద్యోగానికి పనికొస్తాయి. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

మీన రాశి

ఈ రోజు సంతోషకరమైన రోజుగా మార్చుకోవడానికి మానసిక ఆందోళనలకు, ఒత్తిడికి దూరంగా ఉండాలి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో ముందే ఒక ప్రణాళిక వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

Next Story