Today's horoscope:ఈరోజు(02-06-2026) రాశి ఫలాలు

by Jakkula.Mamatha |

ఈ రోజు(మంగళవారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Todays horoscope:ఈరోజు(02-06-2026) రాశి ఫలాలు
X

మేష రాశి

ఈ రోజంతా మీకు చాలావరకు ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ఊహించని శుభవార్త వింటారు. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్ వస్తోంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఇవాళ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, పాత రుణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి లేదా అధికారుల మన్ననలు పొందడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిథున రాశి

ఉద్యోగులు సకాలంలో తమ బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగి, రాబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీ పనితీరుకు గుర్తింపు లేదా పదోన్నతి లభించే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు, మొండి బాకీలు వసూలవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

సింహ రాశి

ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు గడిస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. బంగారం లేదా స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి.

కన్య రాశి

ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఖర్చులను నియంత్రించుకోవడం ఈరోజు మీ ప్రధాన లక్ష్యం కావాలి. ఎవరికీ ఆర్థిక విషయాల్లో హామీలు ఇవ్వకండి. వ్యాపార లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. పొదుపు పై దృష్టి పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పుతాయి.

తుల రాశి

మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. స్వల్ప దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. స్నేహితుల సహాయంతో కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయి చేతికి డబ్బు అందుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై లాభం చేకూరుతుంది. స్టాక్ మార్కెట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో పనులు కొంత ఆలస్యంగా సాగుతాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా మాట తీరులో జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి.

మకర రాశి

మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా పడిన పనులు ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు స్నేహితుల సహాయంతో పరిష్కారం లభిస్తుంది.

కుంభ రాశి

ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాబడి బాగున్నా, విలాసాలు లేదా అనవసర వస్తువుల కొనుగోలు కోసం డబ్బు వృథా అయ్యే ప్రమాదం ఉంది. బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం ఉత్తమం. వ్యాపారస్తులకు సాధారణ లాభాలు ఉంటాయి. అప్పులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయవద్దు.

మీన రాశి

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

Next Story