- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope:ఈ రోజు(02-07-2026) రాశి ఫలాలు
ఈ రోజు(గురువారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి పూర్తి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.
వృషభ రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. అయితే, కుటుంబంలో కొద్దిపాటి చికాకులు, ధనవ్యయం పెరిగే సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి.
మిథున రాశి
ఈ రోజు వీరికి శుభప్రదంగా ఉండబోతుంది. మీరు పట్టుదలతో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి కోసం వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు నియంత్రించుకోండి.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఒత్తిడితో కూడిన రోజుగా చెప్పవచ్చు. గజలక్ష్మీ యోగ ప్రభావం ఉన్నప్పటికీ, రోజువారీ పనుల్లో కొన్ని వ్యయ ప్రయాసలు తప్పవు. ఆర్థికంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా మాటతీరులో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దైవదర్శనం ప్రశాంతతను ఇస్తుంది.
సింహ రాశి
ఈ రోజు సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన పనుల్లో పురోగతి కనిపిస్తుంది.
కన్య రాశి
ఈ రాశి వారికి ఇవాళ అద్భుతంగా ఉండబోతుంది. అదృష్టం మీ వైపు ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు.
తుల రాశి
ఈరోజు వీరికి సాధారణ ఫలితాలు ఉంటాయి. పనులలో కొంత జాప్యం లేదా ఆటంకాలు ఎదురుకావచ్చు. బాధ్యతలు పెరగడం వల్ల శ్రమాధిక్యం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. పట్టుదలకు పోకుండా ఉండటం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఇవాళ శుభప్రదం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంతకాలం అనుభవించిన కష్టాలు, సమస్యలు క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. భూ, గృహ లావాదేవీలు కలిసివస్తాయి.
మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. గజలక్ష్మి యోగం వల్ల అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ బాధ్యతలను సకాలంలో పూర్తి చేసి అధికారుల మద్దతు పొందుతారు. అయితే ఆర్థికంగా కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. బంధుమిత్రులతో విరోధాలు రాకుండా జాగ్రత్త పడాలి. మానసిక ఆందోళన కలగకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
మీన రాశి
ఈ రోజు మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయం బాగున్నా అంతే స్థాయిలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసర భయాందోళనలకు లోనవకండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉంటూ, ఇష్ట దైవ ప్రార్థన చేయడం మంచిది.






