Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

by Kodari Anjali |

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని.. దీంతో ఏపీలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని.. దీంతో ఏపీలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు కురవనున్నాయని తెలిపింది. ముఖ్యంగా నెల్లూరులో మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా వానలు ఉన్నాయని.. ఇప్పటికే హైదరాబాదులో చిరుజల్లులు పడుతున్నాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరిగే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..25 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 24 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.


Next Story