AP EAPCET 2026 దరఖాస్తుకు ఈ రోజు చివరి అవకాశం

by Malleboina Mahesh |

నేడే AP EAPCET 2026 దరఖాస్తుకు ఆఖరి తేదీ (మార్చి 24)! లేట్ ఫీ లేకుండా అప్లై చేసుకోండి; ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి సువర్ణావకాశం.

AP EAPCET 2026 దరఖాస్తుకు ఈ రోజు చివరి అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో సీట్లు సంపాదించుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది.. ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 పరీక్షకు ఎటువంటి అదనపు రుసుము (Late Fee) లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి నేడే (మార్చి 24) ఆఖరి రోజుగా తెలిపింది. నోటిఫికేషన్ ప్రకారం రేపటి నుంచి దరఖాస్తు చేసే అభ్యర్థులు అదనంగా ₹10,000 వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టాప్ గవర్నమెంట్, ప్రైవేటు కళాశాలల్లో సీటు సాధించడమే కాకుండా, అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం అందించే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ (Free Seat) పొందేందుకు ఈ పరీక్ష ఒక సువర్ణావకాశం గా నిలవనుంది.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులు బి.టెక్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి 30కి పైగా ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. సాఫ్ట్‌వేర్ రంగం, శాస్త్రీయ పరిశోధనలు, ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ కోర్సులు బలమైన పునాదిని వేస్తాయి. ఒక్క రోజు ఆలస్యమైనా వేల రూపాయల జరిమానా పడటమే కాకుండా, సర్వర్ రద్దీ వల్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విద్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉన్నత విద్యా కలలను సాకారం చేసుకోవాలనుకునే అభ్యర్థులు తమ వివరాలను సరిచూసుకుని, నేటి అర్ధరాత్రి లోపు దరఖాస్తు సమర్పించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story