- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల!
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక అలర్ట్ జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ (2026) నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టికెట్ల కోటాను బుధవారం (ఈరోజు) ఉదయం 10:00 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయి తమకు కావలసిన స్లాట్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది కాబట్టి, భక్తులు సమయానికి అలర్ట్‌గా ఉండి బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
దర్శన టికెట్ల తో పాటు తిరుమల, తిరుపతిలలో భక్తులు బస చేయడానికి అవసరమైన వసతి గదుల (Accommodation) కోటాను కూడా ఈరోజే మధ్యాహ్నం 3:00 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. సెప్టెంబర్ నెలలో స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఇటు దర్శన టికెట్లతో పాటు అటు వసతి గదులను కూడా ఇప్పుడే రిజర్వ్ చేసుకోవడం ద్వారా తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకోవచ్చని టీటీడీ పేర్కొంది. భక్తులు నకిలీ వెబ్‌సైట్లను నమ్మకుండా కేవలం అధికారిక పోర్టల్ ద్వారానే బుకింగ్స్ చేసుకోవాలని స్పష్టం చేసింది.






