- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో క్యూలైన్లలో రద్దీ తగ్గి, దర్శనాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉచిత సర్వదర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. ఇక సమయ నిర్దేశిత (SSD) టోకెన్లు పొందిన భక్తులకు 2 నుంచి 4 గంటలు, ఇక రూ.300 శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన వారికి 2 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతోంది.
కాగా, నిన్న ఒక్కరోజే శ్రీవారిని 76,447 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 21,708 మంది భక్తులు స్వామి వారికి తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.3.42 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక జనవరి 25న జరగనున్న రథసప్తమి వేడుకల దృష్ట్యా జనవరి 24 నుండి 26 వరకు తిరుపతిలో సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.






