చిరుత vs పులి.. గెలుపెవరిదంటే..

by Javid Pasha |

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా అటవీ ప్రాంతంలో మరో చిరుత మరణించింది. ఇటీవల ఈ ప్రాంతంలో వివిధ ఘటన

చిరుత vs పులి.. గెలుపెవరిదంటే..
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా అటవీ ప్రాంతంలో మరో చిరుత మరణించింది. ఇటీవల ఈ ప్రాంతంలో వివిధ ఘటనల్లో చిరుతలు మరణిస్తున్నాయి. అయితే తాజాగా మృతి చెందిన చిరుత ఒక పెద్దపులితో జరిగిన ఘర్షణలో చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. బండి ఆత్మకూరు మండలం నల్లమల అడవిలో పెద్దపులి, చిరుత పులి ఘర్షణలో చిరుతపులి మరణించింది. మృతి చెందిన చిరుతపులిని పోస్టుమార్టం నిర్వహించి దహనం చేశారు ఫారెస్ట్ అధికారులు. కారణాలేమైనా నల్లమలలో వరుసగా జరుగుతున్న చిరుత పులుల మరణాలతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Next Story