కత్రినా యాక్షన్ సీన్ చేస్తుంటే.. సల్మాన్ పడుకున్నాడా?

by Disha Web Desk 17 |
కత్రినా యాక్షన్ సీన్ చేస్తుంటే.. సల్మాన్ పడుకున్నాడా?
X

దిశ, సినిమా: సల్మాన్​‌ఖాన్​- కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కిన చిత్రం 'టైగర్​3'. 'ఏక్​ థా టైగర్'​, 'టైగర్ జిందా హై' చిత్రాలకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. 2023, ఏప్రిల్ 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో మూవీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఈ సందర్భంగా స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో కత్రినా కైఫ్​బ్లాక్ కలర్ డ్రెస్‌లో మైండ్ బ్లోయింగ్ యాక్షన్​సీన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. తన ప్రాక్టీస్​ముగియగానే పక్కన టేబుల్‌పై నిద్రిస్తున్న సల్మాన్‌ను లేపుతూ 'ఇక నీ టర్న్' అని కత్రిన సూచించగా.. ​'టైగర్​ఎప్పుడూ సిద్ధమే' అని సల్మాన్ చెప్పే డైలాగ్‌తో క్లిపింగ్ ఎండ్ అయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై స్పందించిన ఫ్యాన్స్.. ఈ 'టైగర్' కూడా భారీ లెవల్లో గర్జిస్తుందంటున్నారు.

Next Story

Most Viewed