- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్గొండ జిల్లాలో మూడు మోడల్ సోలార్ గ్రామాలు
రూ. 97 కోట్లతో నల్గొండ జిల్లాలో మూడు మోడల్ సోలార్ గ్రామాలను అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం.

దిశ, తెలంగాణ బ్యూరో: నల్గొండ జిల్లాలో సుస్థిర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జిల్లాలోని అనుముల, కంగాల్, ముదిగొండ గ్రామాలను మోడల్ సోలార్ విలేజెస్‌గా (ఆదర్శ సౌర గ్రామాలు) అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొండారెడ్డిపల్లిని విజయవంతంగా సోలార్ గ్రామంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో, తాజాగా ఈ మూడు గ్రామాల్లో సుమారు 15 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం నల్లగొండ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సిఎండి ముషారఫ్ ఫరూఖి, రెడ్కో విసి అండ్ ఎండి వి. అనిల పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 97.39 కోట్లు వ్యయం చేయనున్నట్లు వారు వెల్లడించారు.
ఈ పథకం ద్వారా మూడు గ్రామాల్లోని మొత్తం 2,895 మంది వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. దీనిద్వారా 1644 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 1251 ఇతర విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్యానెల్స్ అమర్చనున్నారు. సమీక్ష సమావేశం అనంతరం అనుముల గ్రామంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్ వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు, సామాన్య వినియోగదారులకు విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు డాక్టర్ ఎన్. నరసింహులు, వి. శివాజీ, చీఫ్ ఇంజనీర్ బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.






