- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదానీ కంపెనీల్లో అబుదాబి సంస్థ రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు!
ముంబై: అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్‌సీ)..telugu latest news

ముంబై: అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్‌సీ) దేశీయ అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీకి చెందిన మూడు కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు అదానీ గ్రూప్ విస్తరణ కోసం సుమారు రూ. 15,000 కోట్లకు పైగా పెట్టుబడుల సాయం చేయనుంది. ఈ మొత్తంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ. 7,700 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీలో రూ. 3,850 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో రూ. 3,850 కోట్లను ఐహెచ్‌సీ ఇన్వెస్ట్ చేయనుంది. అయితే, ఈ పెట్టుబడుల మొత్తానికి సంబంధించి ఐహెచ్‌సీకి ఆయా కంపెనీల్లో ఎంత మొత్తం వాటా కేటాయించనున్నారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ పెట్టుబడులకు మూడు కంపెనీల బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. కంపెనీల బోర్డుల నుంచి ఆమోదం లభించిన నేపథ్యంలో నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు వచ్చిన నెల రోజుల్లోగా ఈ లావాదేవీలు పూర్తవుతాయని తెలుస్తోంది. ఈ పెట్టుబడులను ఉపయోగించి అదానీ గ్రూప్ కంపెనీల వ్యాపార విస్తరణ, బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేయడం, సాధారణ ప్రయోజనాల కోసం మూలధనానికి వినియోగించనున్నారు.






