మేము మాజీ నక్సలైట్లం.. భూమి వదలకపోతే చంపేస్తాం..

by Vinod kumar |

దిశ, వేములవాడ: వేములవాడ పట్టణ పరిధిలో - Threats in the name of former Naxalites in Vemulawada urban area

మేము మాజీ నక్సలైట్లం.. భూమి వదలకపోతే చంపేస్తాం..
X

దిశ, వేములవాడ: వేములవాడ పట్టణ పరిధిలో ఒక భూ విషయంలో ఇద్దరు వ్యక్తులు నూకలమర్రి గ్రామానికి చెందిన బొడ్డు కుమార్ నారాయణ, వేములవాడకు చెందిన కిష్టంపేట బాబు జంగిటి బాబులు మాజీ నక్సలైట్స్ అంటూ భూమిని వదిలిపెట్టాలని లేకపోతే చంపేస్తామంటూ తుపాకీతో బెదిరించినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఎవరైనా ఇలాంటి సెటిల్మెంట్స్ చేసినా.. ఎవరైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వారిపై ఫిర్యాదు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వారి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Next Story